Bapu gari Bomma







అందమైన భామ ను వర్ణించడానికి ,అచ్చమైన  తెలుగు అమ్మాయి అంటే ఇలా ఉండాలని చెప్పడానికి వేరే కవిత్వం అక్కర్లేదు ,"బాపు బొమ్మ "లా అని ఒక్క ఉపమానం చాలు. 
బాపు చేతిలో రూపు దిద్దుకున్న చిత్రాలు ఇన్నా  అన్నా ?మదిలో మెదిలే ఆలోచనలను అవలీలగా కుంచె తో మలచి ,కాన్వాస్ పై అమర్చిన బాపుకి  తెలుగు జాతి ఏమిచ్చి  ఋణం తీర్చుకోగలదని ?

 రంగులలో సినిమా  పూర్తిగా  రాని రోజుల్లో బాపు చిత్రాలు ఎన్నో మనసుల్ని కదిలించాయి .రమణ రాత - బాపు గీత అని అనే వారు. 
రమణ గారు రాసే కధల్లో ప్రతి పాత్ర కు కుంచెతో భావాన్ని నింపుతూ బాపు చిత్రాలు చిరకాలం నిలిచిపోయె  శిలా ఫలకాలు . 

పొదుపుగా వాడే గీతలు ,
ఒంపులు తిరిగే ఒరవడి ,
కెంపుల్లాంటి అక్షరాలు ,
మనసుల్ని నింపే భావం  బాపు శైలి. 



బాపు బొమ్మకే కాదు అక్షరాలకు ఒంపులే,ఆ అక్షరాలకు పట్టాభిషేకం చేస్తూ ఎన్నో సంస్థలు "బాపు ఫాంట్ "ను వాడుతున్నాయి . 
అసలు ఒక టైం లో  తమ వివాహ  శుభలేఖ పై బాపు అక్షరాలు ఉండాలని కోరుకునే వారట . అలా ఉంటే ఆ జంట ప్రయాణం  "పెళ్లి పుస్తకం"గ  - " సంపూర్ణ రామయణం "గా రూపు దిద్దుకుని ,భార్య "గోరంత దీపమై"నా ,"మిస్టర్ పెళ్ళాం "ఐనా ,"పెళ్ళికొడుకు "-"బుద్ధిమంతుడై ","అందాల రాముడుగా "ఉంటూ ,కోపాలు వచ్చినా .. కష్టాలు వచ్చినా "ముత్యాల ముగ్గు"లో చుక్కల్లా  కలిసిపోతారని,వారి జీవితం "సుందరకాండ "గా,   "పండంటి జీవితం " అవుతుందని నమ్మకం మరి!




అన్నట్టు మీకు -
"బుడుగు " బొమ్మలు  చేసే అల్లరి గుర్తున్నదా?
"కోతికోమ్మచ్చి" విన్నారుగా ?ఇవన్ని బాపుగా గారి  ప్రయొగాలే ... 

వాల్మీకి ,మొల్ల - ఇలా  ఎందరో కవులు "రామాయణం "  తమదైన మాటల్లో రాసుకున్నారు.మరి "బాపు" తమదైన శైలి లో "గీసుకున్నారు". 



విశేషంగా  రామాయణాన్ని క్లుప్తంగా ఒకే కాన్వాస్ పై చిత్రించి పూజించుకున్న ఆ రామ భక్తుడి పాదాలకి శిరస్సు వంచి వందనం చేయాలి .

ఎంతగా రామాయణాన్ని జీర్ణం చేసుకున్నారో? సాక్షాత్తు శ్రీ మహా లక్ష్మి -- సీతమ్మ గా వస్తే ,
రామయ్య ని మనువాడ బోయెసీతమ్మ - రామచంద్రమూర్తిని చూసిన ఓరకంట  చూపుని మనో నేత్రాలతో ఎంతగా చూసారో బాపు ?
చూసింది చూసినట్టుగా కాన్వాస్ పై గీసుకున్నరు.గీసింది  గీసుకున్నట్టు గా తెరకు ఎక్కించారు " సీతా కల్యాణం" సినిమాలో . 
ఇదే ప్రత్యేకం ... బాపు సినిమాల్లో  . 




ఆయన గీసిన బొమ్మను ,తీసిన సినిమాను పక్క పక్క న పెట్టి చూసుకోవచ్చు . అందుకు చక్కని నిదర్శనం  "రాధా గోపాళం". అసలు సినిమా చూసినట్టు ఉంటుందా ?నిజంగా కళ్ళముందు జరిగేటట్టు ఉంటుంది బాపు సినిమా అంటే . 

ఆడంబరాలు లేకుండా ప్రతి ఇంట్లో జరిగే సన్నివేశాలు , సజావుగా సాగిపోయే కధనం, సహజమైన కోపాలు, చక్కటి కుటుంబ బంధాలు 
బాపు సినిమాల్లో ప్రత్యేకతలు. ముఖ్యంగా మాటలు ... బాపు సినిమాల్లో మాటలు  అచ్చమైన తెలుగు తో సున్నితంగా ఉంటాయి . 
కొన్ని సందర్భాలో ఇద్దరి మధ్య  ప్రశ్నలు - సనాధానాలు భలే చిత్రంగా ఉంటాయి,సామెతల్లా కవిత్వాల్లా ఉంటాయి  . 

రాధాగోపాళం   లో  "కొపమే ల రాధా ఈ కేసు వదల రాదా? "అని హీరో అంటే హీరొయిన్  నవ్వుతూ "తొందరేలా నాధా కాస్త ఆగి చూడరాదా ? " అని సమాధానం ఇవ్వడం ఇలా ఎన్నో బాపు సినిమాలలో మాటల ముత్యాలు . జగడాలు , సరదాలు ,చిలిపి కోపాలు,ఇంకా  హీరోయిన్ కంట నీరు కూడా అందమే  బాపు సినిమాల్లో . బాపు బొమ్మ కావడం అంటే హీరోయిన్ కి ఒక వరం లాగ. 
బాపు సినిమాల్లో నటి మాటతీరు ,కంటి చూపు ,చీరకట్టు,నవ్వు,కోపం ఒక్కటేమిటి - అన్ని ప్రత్యెకమే . 



జాతి గర్వపడేలా తన చిత్రాలతో యజ్ఞం చేసారు బాపు,ఎన్నో దేవత మూర్తులు,ఇంకెన్నో భావాల ఆణిముత్యాలు ,మరిన్నో మరపురాని 
ముగ్ద మనోహర రూపాలు తన కాన్వాస్ పై ప్రాణం పోసుకున్నాయి !
మనిషిగా బ్రతికినందుకు ఇలా బ్రతకాలని చూపించారు బాపు ,చాల నిరాడంబరంగా ఉండటం,భగవంతుని  యందు భక్తిని , రమణ గారి తో  స్నేహం  విలువను , చేసే పని యందు అపారమైన  శ్రధ్ధ - బాపు మనకు మనకు నేర్పిన  పాఠాలు . మాటలు రాని నేను బాపు గూర్చి రాసేంత వాడినా? ఆయన యందు అపారమైన అభిమానం తో ఏదో చేతకాని రాతలు అంతే ... 
ఏదేమైనా 
నాకు అనిపించేది ఒక్కటే ... మళ్లి ఒక్కసారి బాపు వస్తే బావుండు ... !!!

-- ప్రవీణ్ కుమార్ రేజేటి 

sri rama pattabhishekam painting





SatyaBhama 

Ardhanaareeswaram

Hare Rama -Hare Krishna

Bapu Painting  vivaha subhaleka










Share:

0 comments